కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కౌటాల సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. నిరుపేదలకు 200 దుప్పట్లు, నిత్యావసర సరుకులు, 5 వాలీబాల్ కిట్లలను పంపిణీ చేశారు. 700మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ, ఎస్ఐ లు పాల్గొన్నారు.