
'అన్నదాత సుఖీభవ'.. అనర్హులకు మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు మరో అవకాశం కల్పించింది. మొదటి దశ పరిశీలన, రెండో దశ ధ్రువీకరణలో అర్హత పొందలేకపోయిన రైతుల వివరాలను కంప్లెంట్ మాడ్యూల్లో పొందుపరిచారు. అయితే, అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేయాలంటే ముందుగా గ్రామంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలన్నారు. అలాగే ఈ ఫిర్యాదుల స్వీకరణ జూలై 10లోపు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ తెలిపారు.