కాగజ్‌నగర్ మండలం గన్నారంలోని టీజీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో నూతన మెనూ కార్డును సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు శనివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40శాతం పెంచడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మంచి ఆహారం తీసుకుని చదువులపై శ్రద్ధ పెట్టాలని, పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ఎంఈఓ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ రమ్య తదితరులు పాల్గొన్నారు.