సిర్పూర్ నియోజవర్గ వ్యాప్తంగా హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కౌటాల సీఐ రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ రోజున ఉదయం 6: 00 నుండి మధ్యాహ్నం 12 గంటలలోపే వేడుకలు ముగించుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపద్దని అదే విధంగా పండుగ వాతావరణాన్ని ముగుసుకొని ఇంటికి పరిమితం కావాలని సూచించారు. యువకులు ప్రజలకు అసౌకర్యాలు కలిగించే చర్యలు చేపడితే కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.