కాగజ్నగర్ పట్టణం కాపువాడలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో రోడ్డంతా వర్షానికి బురదతో నిండిపోయింది. చిన్న వర్షానికే రహదారి అంతా రోడ్డుపై మీద నీరు చేరడంతో రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు రోడ్డు అంతా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా ఈ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.