కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కొమురంభీం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ రామనుజం శుక్రవారం ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడతారని, అటువంటి ఇబ్బందిని గుర్తించి జిల్లా ఆర్యవైశ్య సంఘం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్య వైశ్యులు మరెన్నో ఇలాంటి సేవ పనులు చేయాలన్నారు. నాగేశ్వర్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ ఉన్నారు.