కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. కాగజ్ నగర్ మున్నూరు కాపు సంఘ అభివృద్ధి కోసం 25 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.