కౌటల మండలంలోని కౌటల, తలోడి గ్రామంలో ఎవరైనా మరణించినట్లు అయితే దహన సంస్కారాలకు కట్టెల కొరత తీవ్ర ఇబ్బంది అవుతుంది. కొన్ని సందర్భాల్లో కట్టెల కొరకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గురువారం ఈ విషయం స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకవేళ్లగా వెంటనే స్పందించి కావలసిన కట్టెలు ఏర్పాటు చేసి వారి సమస్యను పరిష్కరించారు. గ్రామస్తులు వారికి ధన్యవాదాలు తెలిపారు.