కాగజ్‌నగర్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములు శుక్రవారం ప్రత్యేక పూజలు, నిర్వహించి ఇరు ముడులు కట్టుకున్నారు. 41వ రోజు అయ్యప్ప స్వాముల దీక్ష పూర్తి కావడంతో స్వాములు అంతా గురుస్వామి భిక్షపతి ఆధ్వర్యంలో శబరిమలకు బయలుదేరారు. అయ్యప్ప స్వాములను రైల్వే స్టేషన్ వరకు పట్టణ భక్తులు భక్తి పాటలతో సాగనంపారు. అయ్యప్ప స్వాములను వారి కుటుంబ సభ్యులు, బంధువులు సాగనంపారు.