కాగజ్‌నగర్‌: గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

76చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం రాణి అనే ఆవుకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గాలికుంటు వ్యాధి నివారణ టీకా ఇచ్చి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాడి రైతులు విరివిగా తమ పశువులకు టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్ మాజోజు, డా. పరిమళ, డా. రాజ్ కుమార్, గోపాల మిత్ర రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్