సిర్పూర్: పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన‌ వే‌డుకలు

41చూసినవారు
సిర్పూర్: పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన‌ వే‌డుకలు
సిర్పూర్ ఎమ్మెల్యే డా. హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం వారి నివాసంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బర్త్‌డే కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు ధోనీ శ్రీ శైలం, కాగజ్ నగర్ బిజెపి పట్టణ అధ్యక్షులు కె. శివకుమార్, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.