కాగజ్‌నగర్ పట్టణం సర్ సిల్క్ లోని ఎమ్మెల్యే నివాసంపై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలితాల సాధనకై శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.