కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి, అందవెల్లి గ్రామాల మధ్యలో ఆర్&బి రహదారిపై వర్షపు నీరు నిలిచి బురుదమయంగా ఉన్నందున గత రెండు రోజులు విద్యార్థులు దర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం కాగజ్‌నగర్ ఎంపీడీఒ కోట ప్రసాద్ ఈ సమస్యపై ప్రత్యేకంగా స్పందించి భట్టుపల్లి అందవెల్లి గ్రామ పంచాయతీ కార్మికులతో బురుద నీరు రోడ్డు పక్కకు మల్లించి వాహనాలకు, పాదచారులకు కొంతమేరకు సౌకర్యం కల్పించారు.