

పొదిలి చేరుకున్న జగన్.. భారీగా చేరుకున్న జనం (వీడియో)
మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. "జై జగన్.. జైజై జగన్" అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఆయన్ని చూసేందుకు వచ్చిన జనం కారణంగా మూడు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పొదిలిలో సందడి వాతావరణం నెలకొంది. దారి పొడుగునా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.