
నేడు రెండు జట్లకు కీలకంగా మారనున్న మ్యాచ్
నేడు లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించిన RCB ఈ మ్యాచ్‌లో గెలిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోనుంది. మరోవైపు, ఇప్పటివరకు 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు పరాజయాలతో 10 పాయింట్లు మాత్రమే ఉన్న LSG ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయి.