హైదరాబాద్లో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం కాగజ్‌నగర్ విలేకరుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై హత్యాయత్నంకేసు నమోదు చేసి, రౌడీషీట్ ఓపెన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా, పత్రికా విలేకరులు పాల్గొన్నారు.