కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో సోమవారం బెజ్జూర్ యూత్ నాయకులు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెజ్జూర్ మండల కేంద్రంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బెజ్జూర్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు.