మెగా కంటి వైద్యశిబిరానికి స్పందన

52చూసినవారు
మెగా కంటి వైద్యశిబిరానికి స్పందన
కాగజ్‌నగర్‌లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవ నంలో మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. విశ్రాంత ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శరత్ మాక్స్ విజన్ ఐ ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు హంసల్, నవీన్లు పరీక్షలు చేశారు. 12 మందికి పరీక్షలు నిర్వహించగా, 4గురికి శస్త్ర చికిత్సకు సిఫారసు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు జయదేవ్, నరసయ్య, కార్యదర్శి శివప్రసాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్