కాగజ్‌నగర్ పట్టణం పెట్రోల్ పంప్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం షీటీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. షీటీం ఇన్‌చార్జ్ ఎఎస్ఐ సునీత మాట్లాడుతూ.. మహిళలపై హింస, ఈవ్టీజింగ్, సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురయితే వెంటనే షీటీంను సంప్రదించాలని అన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.