సిర్పూర్ - కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ వరకు నడుస్తున్న భాగ్యనగర్ ఎక్సప్రెస్ 10 రోజులు రద్దు. 3వ లైను పనుల కారణంగా ఈ రైలును ఈనెల 10 నుండి 20వ తేది వరకు నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాగజ్ నగర్ నుండి కాజీపేట్, ఉప్పల్, జమ్మికుంట, పెద్దపల్లి వెళ్ళే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో విద్యార్దులు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఇక్కట్లు తప్పవు.