పెంచికల్పేట్ మండలం కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో స్వర్గీయ ఘనపురం సుశీల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ చలివేంద్రాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మార్వో వెంకటేశ్వర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో అంగడికి వచ్చే వారికి చల్లని నీరిచ్చి దాహార్తి తీర్చడానికి ఘనపురం కుటుంబ సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు.