ఆయుత చండి సహిత అతిరుద్ర మహా యాగంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ పాల్గొన్నారు. అదిలాబాద్ పట్టణంలో గత పది రోజులుగా జరుగుతున్న మహాయాగంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అశోక్ ముస్తాపురే తదితరులు పాల్గొన్నారు.