రథసప్తమి సందర్భంగా కుంభమేళాలో సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమ ఘాట్లో రథసప్తమి సందర్భంగా ఎమ్మెల్యే పుణ్య స్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు గంగామాత కృపవలన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు.