కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలానికి చెందిన ఆర్ఎన్ సర్కార్ సీఆర్పీఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. గురువారం కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకోగా ఆయనకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, రిటైర్డ్ ఆర్మీ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశ సేవకోసం అంకితమైన సర్కార్ బాటలో యువత నడవాలన్నారు.