కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌధరిని కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే

75చూసినవారు
కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌధరిని కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే
కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌధరిని సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు కలిశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరిని వారి అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు వచ్చి, పరిష్కారం దిశగా కృషి చేయవలసిందిగా కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్