దహేగాం మండల కేంద్రంలో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు విరివిగా అందించాలని, ప్రతి పీహెచ్సీ లో నార్మల్ డెలివరీలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఈఎంహెచ్ఓ డా. సీతారాం, వైద్యాధికారి డా. అశ్విని, డా. క్రాంతి, సిబ్బంది, తదితరులున్నారు.