ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చైర్మన్ విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం సిర్పూర్ యూ మండలంలోని పాములవాడ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో చైర్మన్ పాల్గొని దరఖాస్తు విధానాన్ని పరిశీలించారు. భూభారతి చట్టం ఆవశ్యకతను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ధరణి యాప్ తో రైతుల భూ సమస్యలు పేరుకు పోయాయని, దాని పరిష్కారానికే భూభారతి ఏర్పడిందన్నారు.