సిర్పూర్ నియోజకవర్గంలోని జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కోరారు. ఆయన మంగళవారం రాత్రి కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రెటరీ వినోద్ శేషన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల కోసం రూ. 150 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు.