కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కోనేరు కోనప్ప నిత్య అన్నదాన సత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం శాకాంబరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనప్ప, కోనెరు రమాదేవి, రుక్మిణి గోరింటాకు పండగలో పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పట్టణంలోని వివిధ కాలనీల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన సత్రంలో శాకాంబరి ఉత్సాహంగా నిర్వహించారు.