కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం కొమురంభీం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, రిజిస్టర్ లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ రానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలలో జిల్లా విద్యాశాఖ రూపొందించిన శతశాతం సాధన కార్యక్రమం ద్వారా 100శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.