కాగజ్‌నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల ఆకస్మిక తణిఖీ చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కారంతో భోజనం పెట్టిన సంఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచినప్పటికీ విద్యార్థులకు కారంతో భోజనం పెట్టడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు కారంతో భోజనం పెట్టిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.