దహేగాం మండలం ఇట్యాల గ్రామం శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శనివారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం. మొత్తం 12 మందిని పేకాట ఆడుతుండగా ఐదుగురిని పట్టుకున్నామని, మరో ఏడుగురు పరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి రూ. 35, 320/- నాగదు స్వాధీనపరచుకుని దహేగాం పోలిస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.