కాగజ్‌నగర్‌: పది లక్షల చెక్కు.. ఒకరికి ఉద్యోగం

83చూసినవారు
కాగజ్‌నగర్‌ మండలం విలేజ్ నంబర్-11లో పెద్దపులి దాడిలో శుక్రవారం మోర్లే లక్ష్మి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బాదిత కుటుంబ సభ్యుల ఆందోళనతో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని డీఎఫ్ఒ వెల్లడించారు. తక్షణ సహాయం కింద రూ. 20,000 అందించారు. మృతురాలి భర్తకు అటవీ శాఖలో వాచర్ ఉద్యోగం, రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. మరో పది లక్షల చెక్కు, ఐదెకరాల భుమికై ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్