

పొట్టేళ్ల బలి విషయంలో ఘర్షణ (వీడియో)
AP: కర్నూలు జిల్లాలో బుధవారం ఉద్రికత్త చోటు చేసుకుంది. గూడురు మండలం వై.ఖానాపురంలోని సుంకులమ్మ గుడి దగ్గర పొట్టేళ్ల బలి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో వారు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను కోడుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.