మైనార్టీ గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రారంభం

56చూసినవారు
మైనార్టీ గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రారంభం
కాగజ్‌నగర్‌ లోని బల్గలలో ఉన్న మైనార్టీ బాలుర-2 గురుకులంలో ఈ ఏడాది నుంచి ఎంఎల్డీ, సీజీఏ ఒకే షనల్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కొమురం భీం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రమాదేవి, ఆర్ ఎల్సీ గుల్బం శ్రీధర్లు ఆదివారం తెలిపారు. ఎల్ఎల్ఎంటీ కోర్సులో మైనార్టీలకు 23 సీట్లు, ఇతరులకు ఏడు సీట్లు, కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ కోర్సులో 30 సీట్లు మైనార్టీలకు, ఇతరులకు 10 సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు.