కొమ్మినేని శ్రీనివాసరావు (KSR) సోమవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. శుక్రవారమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, కోర్టు సెలవులు ఉండటంతో ఆయన విడుదల ఆలస్యం అయ్యింది. మెజిస్ట్రేట్‌ను కలిసేందుకు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం కోర్టు నుండి బెయిల్ ఉత్తర్వులు అందితే, సాయంత్రానికి ఆయన జైలు నుంచి బయటకొచ్చే అవకాశం ఉంది. కాగా, అమరావతి మహిళలను కించపరిచారన్న అభియోగంపై ఆయన అరెస్టు అయ్యారు.