తన బంధువు కొడుకు ఏరోనాటికల్ ఇంజనీర్ పూర్తి చేశాడని, ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలని మంత్రి కొండా సురేఖ.. తన సహచర మంత్రి శ్రీధర్ బాబును కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. ఈ సంభాషణ కెమెరాల్లో రికార్డ్ అయి, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికార దుర్వినియోగ ఆరోపణలతో విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఉద్యోగాల కోసం సిఫారసు కోరుతూ కామెంట్లు చేశారు. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.