కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు: RSP

77చూసినవారు
కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు: RSP
బీఆర్ఎస్ 'గురుకుల బాట' అని చెప్పగానే కాంగ్రెస్‌కు భయం పుట్టిందని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పింది. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. గతంలో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న నాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. నాపై ఆరోపణలకు ఆధారాలుంటే సీబీఐ విచారణకు ఇవ్వండి' అని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్