TG: మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తోటి మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకున్నారని, ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో కూడా సురేఖ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల కమిషన్లపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.