రూ.20లక్షలు చోరీ చేసి ఆవు పేడ కింద దాచి పెట్టాడు
చోరీ చేసిన సొమ్మును ఆవు పేడ కింద దాచి పెట్టిన విచిత్ర ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగింది. గోపాల్ బెహెరా అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో రూ.20లక్షలు చోరీ చేసి వాటిని తన బావ రవీంద్ర ద్వారా ఒడిశాకు తరలించాడు. అయితే చోరీపై విచారణ చేపట్టిన పోలీసులు గోపాల్ అత్తగారింట్లో వెతకగా పెంట కింద దాచి పెట్టిన సొమ్మును గుర్తించి రవీంద్ర, తన అత్తను అదుపులోకి తీసుకోగా గోపాల్ పరారీలో ఉన్నాడు.