గురుకులాల్లోనీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జి. భానుమతి ఆదేశించారు. అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ గురుకులాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, వసతులపై ఆరా తీశారు. వంటశాల, కూర గాయల నిల్వలు, విద్యార్థుల డార్మెటరీ, పరిసర ప్రాంతాలు పరిశీలించి, నిర్వాహకులకు సూచనలు చేశారు.