అశ్వారావుపేట మండల పరిధిలోని రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నం. 30, 36, 39లో ఉన్న భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గిరిజనులు తహసీల్దార్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్, హైకోర్టు ఆదేశాల ప్రకారం జాయింట్ సర్వే చేసి ఫారెస్టు, ఎఫ్డీసీ ఆధీనంలో ఉన్న 573 ఎకరాలను తక్షణమే హక్కు పత్రాలు ఉన్న గిరిజనులకు అప్పగించాలని వారు కోరారు.