నిబంధనల ప్రకారమే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేటలో జరిగిన 'మన మున్సిపాలిటీ-మన అభివృద్ధి' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా మున్సిపాలిటీ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో వార్డులు, డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరించారు. కాగా, కొత్తగా ఏర్పాటైన 22 వార్డుల్లో 5వ వార్డు నుంచి 22వ వార్డు వరకు విభజన అడ్డగోలుగా చేశారన్నారు.