అశ్వారావుపేట మండలంలో ఉన్న అనాథ పిల్లల ఆశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిల్లలకు అందిస్తున్న కనీస సౌకర్యాల గురించి ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాల వలన సంరక్షణ కష్టంగా ఉండడం వలన వచ్చిన అనాథ పిల్లలకు ఆహారం, తదితర అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా తెలిపారు.