అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినూత్నంగా ఆర్టీసీలో ఆత్మీయ పలకరింపులు కార్యక్రమం నిర్వహించారు. ముష్టిబండ నుంచి అశ్వారావుపేట వరకు ప్రజలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ, ప్రభుత్వ పథకాల అమలు, ఎదురయ్యే సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు భయపడకుండా సమస్యలు చెప్పేందుకు ప్రోత్సహించారు.