భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామ పంచాయతీ దురదపాడు శివారు పాలగుంపులో సోమవారం అశ్వారావుపేట ఏమ్మెల్యే పర్యటించారు. ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నల్లబెల్లి స్వప్న, మడకం సరస్వతి, గీగా రాజు, కోర్స భద్రమ్మకి చెందిన నాలుగు తాటాకు ఇండ్లు పూర్తిగా దగ్ధమైనందున వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జారె. ఆదినారాయణ తాత్కాలిక నివాసాలు కుటుంబ అవసరాల కోసం తక్షణ సహాయం అందజేశారు.