మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు, వంట బిల్లులు, గుడ్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. బుధవారం అశ్వారావుపేట ఎంఈఓ కార్యాలయం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారికి అందజేశారు.