తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు విధుల నుండి అకారణంగా, చిన్న పొరపాట్లు వలన తొలగించబడి రోడ్డున పడ్డారు. గత 16 నెలలుగా విధుల నుండి తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగులు ప్రజాభవన్ చుట్టూ తిరగనారంభించారు. త్రీ సభ్య కమిటీ ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారుల సమక్షంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవనకు అధిక సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.