ఈ నెల 16న జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని, ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట రైతు వేదికలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆదివారం తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు.