అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఓబన్న స్వాతంత్రోద్యమం, సాయుధ రైతాంగ పోరాటంలో చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు తమ్మిశెట్టి శ్రీను, శివరాత్రి శ్రీరామ్ మూర్తి, దేరంగుల శ్రీను, తమిశెట్టి శివాజీ, వల్లేపు రాఘవులు, బండారి వెంకటేశ్వరరావు. గండికోట సాయిబాబు పాల్గొన్నారు.